ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మమత బెనర్జీ ఏకగ్రీవ ఎన్నిక

ABN, First Publish Date - 2021-07-24T02:03:04+05:30

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఆ పార్టీ చీఫ్ మమత బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ఈ వివరాలను తెలిపారు. 


తమ పార్టీ ఎంపీలంతా మమత బెనర్జీని ఏకగ్రీవంగా పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీకి ఆమె సుదీర్ఘ కాలం నుంచి మార్గదర్శనం చేస్తున్నట్లు తెలిపారు. ఓ వాస్తవాన్ని తాము అధికారికం చేస్తున్నామన్నారు. తమ చైర్‌పర్సన్ (మమత) ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా పని చేశారని చెప్పారు. పార్లమెంటరీ పార్టీకి మార్గదర్శనం చేసే దార్శనికత ఆమెకు ఉందన్నారు. ఆమెకు అనుభవం, బుద్ధి సూక్ష్మత ఉన్నాయన్నారు. తాము ఈ నిర్ణయాన్ని సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా తీసుకున్నామన్నారు. ఆమె అన్ని వేళలా ఓ ఫోన్ కాల్ దూరంలో ఉంటారని తెలిపారు. తమకు మరింత సాధికారత వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. 


అయితే మమత బెనర్జీ ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు కాదు. ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో పరాజయంపాలయ్యారు. 



Updated Date - 2021-07-24T02:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising