ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నా : అధికారికంగా ప్రకటించిన మమత

ABN, First Publish Date - 2021-03-05T20:20:30+05:30

సందిగ్ధం వీడిపోయింది. స్పష్టత వచ్చేసింది. పోటీకి వేదిక సిద్ధమైపోయింది. బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఓ స్పష్టతకు వచ్చేసింది. అందరూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : సందిగ్ధం వీడిపోయింది. స్పష్టత వచ్చేసింది. పోటీకి వేదిక సిద్ధమైపోయింది. బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఓ స్పష్టతకు వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే పంతానికి పచ్చజెండా ఊపారు మమతా బెనర్జీ. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నానని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆమె భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఈసారి మాత్రం ఆమె నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన స్ట్రాంగ్ మ్యాన్ సుబేందును, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ పోటీకి దిగుతున్నారు. మరోవైపు 294 స్థానాలకు గాను ఆమె అభ్యర్థులను ప్రకటించారు. అందరూ 80 సంవత్సరాల లోపు వయస్సు వారే. అందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్డ్ క్యాస్ట్, 17 మంది షెడ్యూల్ ట్రైబ్ వారు ఉన్నారు. 

Updated Date - 2021-03-05T20:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising