ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే

ABN, First Publish Date - 2021-05-09T22:15:19+05:30

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి సూచనలతో కూడిన లేఖ రాశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి సూచనలతో కూడిన లేఖ రాశారు. కోవిడ్ రోగులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, కోవిడ్ సోకిన వారిని కాపాడుకునేందుకు సామాన్యులు భూములు, నగలు అమ్ముకుంటూ అష్టకష్టాలు పడుతున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ బాధ్యతతో కలిసి కట్టుగా, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని ఆ లేఖలో సూచించారు. కేంద్రం తను నెరపాల్సిన విధుల నుంచి తప్పించుకోవడం వల్ల పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు కరోనా కట్టడికి విపరీతమైన యుద్ధం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి, కోవిడ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఖర్గే ఆ లేఖలో సూచించారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ల కోసం కేటాయించిన 35,000 కోట్లతో భారతీయులందరూ టీకాలు వేసుకునేలా చూడాలన్నారు. వీటితో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి, టీకాలకు, పీపీఈ కిట్లకు, ఆక్సిజన్ లాంటి విషయంలో లైసెన్సింగ్ విధానం ఉండేలా చూడాలని కేంద్రానికి సూచించారు. నిరుద్యోగ వసలదారులకు నరేగా పథకం కింద నిధులతో పాటు పని రోజులు కూడా పెంచాలని ఖర్గే లేఖలో సూచించారు. 

Updated Date - 2021-05-09T22:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising