ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ప్రారంభించే ప్రాజెక్టులన్నీ మావే: అఖిలేష్ యాదవ్

ABN, First Publish Date - 2021-12-11T21:49:12+05:30

2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అది వాస్తవంలో జరిగిందా? పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీస ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. బీజేపీకి అభివృద్ధి తెలియదు. కానీ ప్రకటనలు ఇవ్వడం మాత్రం తెలుసు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినవని, పనులు చేసినవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి ప్రకటనలు చేయడం తప్ప పనులు చేయడం రాదని, ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఖర్చు ప్రకటనలకే కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


‘‘2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. అది వాస్తవంలో జరిగిందా? పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీస ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు. బీజేపీకి అభివృద్ధి తెలియదు. కానీ ప్రకటనలు ఇవ్వడం మాత్రం తెలుసు. అందుకే ప్రాజెక్టులకు కేటాయించే నిధుల కంటే ప్రకటనలకు ఖర్చు చేసే డబ్బే ఎక్కువ. సమాజ్‌వాదీ పార్టీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇచ్చింది. బీజేపీ వారిపై లాఠీ చార్జ్ చేసింది. పేదలకు లోహియా ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇచ్చాం. బీజేపీ రైతులను రోడ్లపైకి ఈడ్చి తొక్కించి చంపింది. ఎస్పీ అభివృద్ధిని నమ్ముతుంది. బీజేపీ పేర్లు మార్చే పని మాత్రమే చేస్తుంది’’ అని అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-12-11T21:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising