ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రపై మళ్లీ కరోనా పంజా.. 8వేలకు పైగా కేసులు

ABN, First Publish Date - 2022-01-01T03:02:18+05:30

కరోనా మహమ్మారి మహారాష్ట్రను మళ్లీ చుట్టుముట్టేస్తోంది. గత 24 గంటల్లో 8,067 కేసులు నమోదు కాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా మహమ్మారి మహారాష్ట్రను మళ్లీ చుట్టుముట్టేస్తోంది. గత 24 గంటల్లో 8,067 కేసులు నమోదు కాగా, 8 మంది కరోనాకు బలయ్యారు. గురువారంతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య ఏకంగా 50 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 34 కేసులు వెలుగుచూశాయి. 95 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పేర్కొంది.


ముంబైలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే విధించిన ఆంక్షలను జనవరి 5వ తేదీ వరకు పొడిగించారు. మరోవైపు నేడు కేరళలో మరో 44 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమైక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ మ్యూజియాన్ని మూసివేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. సందర్శకులను ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది.

Updated Date - 2022-01-01T03:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising