ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్లు పెట్టడం మానేసిన కోళ్లు... పోలీసులకు పౌల్ట్రీ యజమానుల ఫిర్యాదు!

ABN, First Publish Date - 2021-04-21T17:09:21+05:30

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పలువురు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పలువురు పౌల్ట్రీ యజమానులు విచిత్రమైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించారు. ఒక కంపెనీ తయారు చేసిన ఆహారం తిన్నతరువాత నుంచి తమ పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు గుడ్లు ఇవ్వడం మనేశాయని  వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ కోళ్ల దాణాను సప్లయ్ చేసిన సంస్థ మూడు నాలుగు పౌల్ట్రీఫారాలకు కూడా దాణా సప్లయ్ చేసిందన్నారు. 


ఆయా పౌల్ట్రీ ఫారాలలో ఇటువంటి సమస్యే తలెత్తిందన్నారు. ఈ సందర్భంగా లాల్ భోర్ పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర మోక్షీ మాట్లాడుతూ... తమ వద్దకు నలుగురు పౌల్ట్రీ యజమానులు... తమ కోళ్లు దాణా తిన్న తరువాత నుంచి గుడ్లు పెట్టడం మానేశాయని ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సదరు కంపెనీపై కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక కంపెనీ నుంచి కోళ్ల దాణాను కొనుగోలు చేశామని, దానిని కోళ్లకు పెట్టినప్పటి నుంచి ఒక్క గుడ్డు కూడా పెట్టడం లేదని వాపోయారు. కాగా ఈ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు సదరు కంపెనీ ప్రతిధులను విచారిస్తున్నారు. అలాగే ఈ విషయమై పశువైద్య అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

Updated Date - 2021-04-21T17:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising