ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికివ్వాల్సిన టీకాలను వీరికిస్తున్న మహారాష్ట్ర

ABN, First Publish Date - 2021-05-11T21:12:43+05:30

కొవిడ్ టీకాల కొరత వేధిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కొవిడ్ టీకాల కొరత వేధిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. వారికోసం కేటాయించిన 3 లక్షల కొవాగ్జిన్ టీకాలను 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కొవాగ్జిన్ నిల్వలను సెకండ్ డోసు కోసం వేచి చూస్తున్న 45 ఏళ్లు పైబడిన వారికి బదలాయిస్తామని ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే మీడియాకు తెలిపారు.  


45 ఏళ్ల దాటిన వారి కోసం 35 వేల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, అయితే ఐదు లక్షల మంది లబ్ధిదారులు కొవాగ్జిన్ రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కొవాగ్జిన్ స్టాక్‌ను 45 ఏళ్లు దాటిన వారి కోసం కేటాయిస్తామని వివరించారు. కాబట్టి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు చెప్పారు. రెండో డోసును నిర్ణీత సమయానికి వేయకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-05-11T21:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising