ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra పోలీసుశాఖలో 25 మంది అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటుకు సిఫారసు

ABN, First Publish Date - 2021-12-03T12:55:17+05:30

మహారాష్ట్ర ప్రభుత్వ హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్కారుకు సంచలన నివేదిక

ముంబై : మహారాష్ట్ర పోలీసుశాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన 25 మంది పోలీసు అధికారులపై సస్పెండ్ చేయాలని సాక్షాత్తూ డీజీపీ సర్కారుకు సంచలన నివేదిక సమర్పించారు.  ఐదు కేసుల్లో డీజీ పరంబీర్ తోపాటు నలుగురు డీసీపీలు, పలువురు ఏసీపీలతో సహా 25మందిని సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే సెప్టెంబర్‌ నెలలో రాష్ట్ర హోం శాఖకు ప్రతిపాదించారు.అయితే సర్కారు మాత్రం కొందరిపైనే సస్పెన్షన్ వేటు విధించింది.మహారాష్ట్ర ప్రభుత్వ హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది. అవినీతి, అక్రమాలకు పాల్పడటంతోపాటు అనధికారికంగా విధులకు ఎగనామం పెట్టడంతో అతనిపై క్రమశిక్షణ చర్యగా సస్పెండ్ చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


 రాష్ట్ర డీజీపీ అనుమతి లేకుండా ముంబై వదిలివెళ్లరాదని సర్కారు ఆదేశించింది.పరంబీర్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఐఎఎస్ అధికారి దేబాషిష్ చక్రవర్తి నివేదికను సర్కారు ఆమోదించి అతనిపై సస్పెన్షన్ విధించింది. పరంబీర్ పరిపాలన పరమైన తప్పులు చేశారని తేలడంతో అతనిపై మహారాష్ట్ర హోంశాఖ డిపార్టుమెంటల్ విచారణ జరపాలని ఆదేశించింది. పరంబీర్ సింగ్ సస్పెన్షన్ ఉత్తర్వుపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేశారు. పరంబీర్ సింగ్ ను పలు అక్రమాలతోపాటు బుకీ సోను జలాన్ కేసులోనూ సిట్ విచారిస్తోంది.మరోవైపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరాగ్ మనేరేపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.


Updated Date - 2021-12-03T12:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising