ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. పరుపుల్లో స్పాంజ్‌కు బదులు వాడిపడేసిన మాస్కులు

ABN, First Publish Date - 2021-04-13T02:50:38+05:30

పరుపుల్లో స్పాంజ్‌కు బదులు వాడిపడేసిన మాస్కులను పెట్టి కుట్టేస్తున్న ఓ కంపెనీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలగావ్: పరుపుల్లో స్పాంజ్‌కు బదులు వాడిపడేసిన మాస్కులను పెట్టి కుట్టేస్తున్న ఓ కంపెనీ గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. జలగావ్ జిల్లాలోని ఓ పరుపుల తయారీ కంపెనీపై దాడి చేసిన పోలీసులు వాడిపడేసిన లక్షలాది మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ పరుపుల్లో పత్తి, స్పాంజ్ లాంటి వాటికి బదులుగా వాడి పారేసిన మాస్కులను లోపల పెట్టి పరుపులు తయారు చేస్తోందంటూ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఆ కంపెనీపై దాడి చేసిన పోలీసులు అక్కడ గుట్టలుగా ఉన్న పాత మాస్కులు చూసి విస్తుపోయారు.


ఆ మాస్కులను తగలబెట్టారు. కంపెనీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంఐడీసీ పరిధిలోని కుసుంబ గ్రామంలో ఉన్న ఆ ఫ్యాక్టరీకి వెళ్లిన తాము పరుపుల్లో మాస్కులు పెట్టి కుడుతుండడాన్ని చూసి షాకయ్యామని పోలీసులు తెలిపారు. కంపెనీ ఆవరణలో గుట్టలుగా ఉన్న మాస్కులను తగలబెట్టేశామని వివరించారు.

Updated Date - 2021-04-13T02:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising