ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనం గుమిగూడకుండా జాతీయ విధానం తీసుకురండి.. మోదీకి ఉద్ధవ్ సూచన

ABN, First Publish Date - 2021-07-16T21:39:12+05:30

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం ఒకేచోట గమిగూడకుండా చూడాలని, దీనిపై జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురావాలని ప్రధాని మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. ప్రధాని మోదీ శుక్రవారంనాడు జరిపిన వర్చువల్ మీట్‌లో థాకరే ఈ సూచన చేశారు. కరోనా పరిస్థితిపై మోదీ ఈ సమావేశంలో సమీక్షించారు.


కోవిడ్ మహమ్మారిపై ప్రభుత్వం పోరాటం సాగిస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటమనేది ఒక సవాలు అవుతోందని థాకరే అన్నారు. సామాజిక రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో జనం గుమిగూడకుండా నిరోధించేందుకు ఒక జాతీయ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్‌తో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినట్లయితే ఎదుర్కొనేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నామని అన్నారు.

Updated Date - 2021-07-16T21:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising