ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళ తల్లి పాట జాతీయ గీతం కాదు : మద్రాస్ హైకోర్టు

ABN, First Publish Date - 2021-12-10T21:03:38+05:30

తమిళ తల్లిని గౌరవిస్తూ, ప్రశంసిస్తూ పాడే పాట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధురై : తమిళ తల్లిని గౌరవిస్తూ, ప్రశంసిస్తూ పాడే పాట కేవలం ప్రార్థన పాట అని, జాతీయ గీతం కాదని, అందువల్ల ఆ పాటను పాడేటపుడు ప్రతి ఒక్కరూ నిల్చోవలసిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తీర్పు చెప్పింది. 2018లో రామేశ్వరం పోలీసులు నామ్ తమిలార్ కట్చి (ఎన్‌టీకే) కార్యకర్తలపై దాఖలు చేసిన కేసును రద్దు చేసింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ తీర్పు చెప్పారు. 


2018 జనవరి 24న కంచి కామకోటి పీఠం శ్రీ విజయేంద్ర సరస్వతి సమక్షంలో తమిళ-సంస్కృత నిఘంటువును అప్పటి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆవిష్కరించారు. చెన్నైలోని సంగీత అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ తల్లి గీతాన్ని ఆలపించిన సమయంలో శ్రీ విజయేంద్ర సరస్వతి కూర్చునే ఉండటంపై తీవ్ర దుమారం రేగి, చర్చ జరిగింది.


మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్తూ, తమిళ తల్లి గీతాన్ని ఆలపించేటపుడు ప్రేక్షకులు నిల్చోవాలని తెలిపే చట్టపరమైన లేదా కార్యనిర్వాహక ఆదేశాలేవీ లేవని పేర్కొంది. ఇది జాతీయ గీతం కాదని తెలిపింది. అయితే ఈ పాటను గౌరవించాలని పేర్కొంది. ప్రేక్షకులు సంప్రదాయం ప్రకారం ఈ పాటను గౌరవించాలనడం సరైనదేనని తెలిపింది. గౌరవ ప్రదర్శనకు ఇదొక్కటే మార్గామా? అనేది మన ముందు ఉన్న ప్రశ్న అని తెలిపింది. మనం బహుతావాదాన్ని, వైవిద్ధ్యాన్ని ఆనందంగా ఆచరిస్తున్నపుడు, కేవలం ఒకే పద్ధతిలో గౌరవాన్ని ప్రదర్శించవచ్చునని చెప్పడం సరికాదని పేర్కొంది. 


సాంఘిక, సాంస్కృతిక జీవనంలో సన్యాసులకు ప్రత్యేక స్థానం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదని తెలిపింది. సన్యాసుల ముందు చక్రవర్తులు, రాజులు సైతం సాష్టాంగ దండ ప్రణామం చేసేవారని తెలిపింది. రాజ సభలోకి సన్యాసులు ప్రవేశించినపుడు రాజులు స్వయంగా సింహాసనం నుంచి దిగి, సగౌరవంగా ఆహ్వానించి, నమస్కరించేవారని చెప్పింది. సన్యాసిగా మారిన వ్యక్తి సామాన్య జీవితం నుంచి మరణించినట్లేనని తెలిపింది. ఆయన పునర్జన్మ స్వీకరిస్తారని పేర్కొంది. సన్యాసి ప్రధానంగా ధార్మిక చింతనతో జీవిస్తారని, ఈ కార్యక్రమంలో తమిళ తల్లి గీతాన్ని పాడినపుడు శ్రీ విజయేంద్ర సరస్వతి ధ్యాన నిమగ్నుడయ్యారని తెలిపింది. తమిళ తల్లి పాట ఓ ప్రార్థన పాట కాబట్టి, ఆయన ధ్యాన స్థితిలో కూర్చోవడం సమర్థనీయమేనని వివరించింది. కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఉండటం ఆయన విధానంలో తమిళ తల్లిని గౌరవించడమేనని పేర్కొంది. 


Updated Date - 2021-12-10T21:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising