ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పరీక్షల రద్దు కుదరదు : హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-08T15:52:24+05:30

అరియర్‌ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అంగీకరించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెరంబూర్‌(చెన్నై): అరియర్‌ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అంగీకరించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా 2020 విద్యాసంవత్సరం కళాశాల విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా పాస్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అరియర్స్‌ ఉన్న విద్యార్థులు కూడా పాస్‌ అయినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ధర్మాసనం, అరియర్స్‌ ఉన్న విద్యార్థులందరూ పాస్‌ అయినట్టు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు అంగీకరించలేమన్నారు. అరియర్‌ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, ఈ విషయమై విశ్వవిద్యాలయ పరీక్షల బోర్డు, రాష్ట్రప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


Updated Date - 2021-04-08T15:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising