ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కార్బీవ్యాక్స్... ఓ గేమ్ ఛేంజర్..’

ABN, First Publish Date - 2021-06-18T05:08:07+05:30

బయాలాజికల్ ఈవాన్స్ సంస్థ రూపొందించిన కార్బీవ్యాక్స్ కరోనా టీకాకు 90 శాతం ప్రభాశీలత ఉందని ప్రభుత్వ కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. ఎన్‌కే అరోరా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బయాలాజికల్ ఈవాన్స్ సంస్థ రూపొందించిన కార్బీవ్యాక్స్ కరోనా టీకాకు 90 శాతం ప్రభాశీలత ఉందని ప్రభుత్వ కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డా. ఎన్‌కే అరోరా తెలిపారు. అత్యంత చవకగా లభించే ఈ టీకా‌ను ఓ గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటం తీరుతెన్నులను పూర్తిగా మార్చివేయగల సత్తా ఈ టీకాకు ఉందన్నారు. అమెరికా టీకా నోవోవాక్స్ లాంటిదే కార్బీవ్యాక్స్ కూడా అని ఆయన తెలిపారు. నోవోవ్యాక్స్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుమతి పొందింది. ఇక కార్బీవ్యాక్స్ ఖరీదు రూ. 250 మించకపోవచ్చని ఓ అంచనా. ప్రస్తుతం ఈ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ కల్లా ఇది మార్కెట్‌లోకి రావచ్చని తెలుస్తోంది. మరో భారతీయ కంపెనీ జెనోవో బయోఫార్మాసిటికల్స్ ఎమ్‌ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ టీకాకు సంబంధించి ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.  

Updated Date - 2021-06-18T05:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising