ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కల్లోలం: పుణ్యస్థలాల్లో భక్తుల ప్రవేశంపై ఆంక్షలు!

ABN, First Publish Date - 2021-04-11T11:42:48+05:30

ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధాని లక్నోలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్యస్థలాల్లో భక్తుల ప్రవేశంపై పలు ఆంక్షలు విధించారు. దీని ప్రకారం లక్నోలోని ఆలయాలు, ధార్మిక స్థలాల్లోకి ఒకసారి ఐదుగురు భక్తులు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిస్తారు. దీనికితోడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. 


లక్నో, మీరఠ్, గాజియాబాద్, నోయిడా, వారణాసి, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, బరేలీలలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. నోయిడా, బరేలీలలో ఏప్రిల్ 17 వరకూ నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ 16 వరకూ నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. నైట్ కర్ప్యూ విధించిన నేపధ్యంలో రాత్రివేళల్లో పోలీసులు పహరా కాస్తున్నారు. కాగా యూపీలోని నాలుగు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బంది హాజరుతోనే పనిచేస్తున్నాయి. మిగిలినవారు వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానంలో పనిచేస్తున్నారు.

Updated Date - 2021-04-11T11:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising