ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!

ABN, First Publish Date - 2021-03-01T16:05:37+05:30

దేశీయ చమురు సంస్థలు మరోమారు వంటగ్యాస్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  దేశీయ చమురు సంస్థలు మరోమారు వంటగ్యాస్‌ వినియోగదారుల నడ్డివిరిచాయి. తాజాగా వాణిజ్య సిలిండర్‌ ధరలు కూడా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్‌పై 95 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెంచిన ధరలు ఈరోజు(సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.


కాగా గడచిన మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ సిలిండర్ ధర 225 రూపాయల వరకూ పెరగడం గమనార్హం. 2020, డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర 594 రూపాయల నుంచి రూ.644కి పెరిగింది. ఆ తరువాత జనవరి 1న 644 రూపాయల నుంచి 694కు పెంచారు. ఫిబ్రవరి 4న ఇది 719 రూపాయలకు చేరింది. మళ్లీ ఫిబ్రవరి 15న మరో 50 రూపాయలు పెంచడంతో 769 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర 819 రూపాయలకు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్‌ ధర 95 రూపాయలు పెంచడంతో, ఇప్పుడు సిలిండర్‌ ధర 1,614 రూపాయలకు చేరింది.  ఇదేవిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.


Updated Date - 2021-03-01T16:05:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising