ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

ABN, First Publish Date - 2021-04-01T02:06:28+05:30

పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నవారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర ఏప్రిల్ 1 నుంచి రూ.10 తగ్గబోతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 


ఈ ఏడాదిలో వంట గ్యాస్ ధర దాదాపు మూడుసార్లు పెరిగింది. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.819, కోల్‌కతాలో రూ.845, ముంబైలో రూ.819, చెన్నైలో రూ.835గా ఉంది. 


ఇదిలావుండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండటంతో వంట గ్యాస్ ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఓ వారంలో మూడుసార్లు తగ్గిన సంగతి తెలిసిందే. 


ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో శాసన సభ ఎన్నికలు జరుగుతుండటంతో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ప్రచారాస్త్రంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలపై అధికార పక్షం స్పందిస్తూ, ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులపై ఆధారపడతాయని చెప్తోంది. 


Updated Date - 2021-04-01T02:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising