ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్కువ ఖర్చుతో శానిటైజర్లు, సర్జికల్‌ మాస్కులు

ABN, First Publish Date - 2021-04-17T07:59:20+05:30

వినూత్న ఆవిష్కరణల్లో ఐఐటీ-హెచ్‌ ముందజలో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్నారు. ఐఐటీ-హెచ్‌ పరిశోధకుడు బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జ్యోత్స్నెందు గిరి నేతృత్వంలో ఐఐటీ-హెచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఐటీ-హెచ్‌కు కేంద్ర మంత్రి ప్రశంసలు

ఆవిష్కరణల్లో ముందంజ అంటూ కితాబు

డ్యూరోకియా ఉత్పత్తులను ప్రారంభించిన రమేశ్‌ పోఖ్రియాల్‌


కంది, ఏప్రిల్‌ 16: వినూత్న ఆవిష్కరణల్లో ఐఐటీ-హెచ్‌ ముందజలో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్నారు. ఐఐటీ-హెచ్‌ పరిశోధకుడు బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జ్యోత్స్నెందు గిరి నేతృత్వంలో ఐఐటీ-హెచ్‌ స్టార్టప్‌ కంపెనీ కియా బయోటెక్‌ ‘డ్యూరోకియా’ పేరుతో నాణ్యమైన సర్జికల్‌ మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు, ఫ్లోర్‌ క్లీనర్లను తయారు చేసింది. శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ఈ ఉత్పత్తులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఉత్పత్తుల్పి ఐఐటీహెచ్‌ చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, డైరెక్టర్‌ బి.ఎ్‌స.మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్‌ పోఖ్రియాల్‌ మాట్లాడుతూ.. పర్యావరణ హితం కోసం ప్రపంచం గుర్తించదగ్గ పరిశోధనలను ఐఐటీ-హెచ్‌ చేయడం ఆనందంగా ఉందన్నారు. డ్యూరోకియా టెక్నాలజీ బృందాన్ని అభినందిస్తున్నానని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఐఐటీహెచ్‌ విద్యార్థులు మరిన్ని పరిశోధనలు చేసి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కరోనాపై పోరాటంలో భాగంగా తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వెంటిలేటర్లను, ఎఫెక్టివ్‌ మాస్క్‌లను, శానిటైజర్లను, మొబైల్‌ యాప్‌లను తయరు చేయడంలో ఐఐటీ-హెచ్‌ ముందంజ ఉంటుందని డైరెక్టర్‌ బి.ఎ్‌స.మూర్తి వెల్లడించారు. కాగా.. డ్యూరోకియా ఫ్లోర్‌ క్లీనర్‌ నెల రోజుల పాటు.. హ్యాండ్‌ శానిటైజర్లు 24 గంటల పాటు సమర్థంగా పనిచేస్తాయి. వీరు తయారు చేసే సర్జికల్‌ మాస్కులు పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయి.

Updated Date - 2021-04-17T07:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising