ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ అంతటా ఆదివారం లాక్‌డౌన్

ABN, First Publish Date - 2021-04-16T18:53:31+05:30

యూపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : యూపీలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అరికట్టడానికి ఆదివారం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ రాష్ట్రమంతటా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. మిగితా దుకాణాలు, షాపులు, మాల్స్.. ఇలా అన్నీ మూసేయాలని ఆదేశించారు. ప్రజలందరూ విధిగా మాస్క్ విధించాలని, లేదంటే 1000 రూపాయల జరిమానాను విధిస్తామని ప్రకటించారు. రెండోసారీ అలాగే కొనసాగితే పది వేల రూపాయల జరిమానాను విధించనున్నారు. శుక్రవారం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అధికారులు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే వారణాసిలో మాత్రం శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ ఉంటుంది. ఈ రెండు రోజులు పూర్తి లాక్‌డౌన్ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు మాత్రం ఉదయం 10 గంటల నుంచి తెరిచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-16T18:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising