ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాకేత్ కోర్టు ఏడో అంతస్తులో లిఫ్ట్ ఆపరేటర్ మృతదేహం, వారంలో రెండో ఘటన

ABN, First Publish Date - 2021-11-13T21:42:54+05:30

సాకేత్ హైకోర్టులోని ఏడో అంతస్తులో లిఫ్ట్ ఆపరేటర్ మృతదేహాన్ని పోలీసులు శనివారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాకేత్ హైకోర్టులోని ఏడో అంతస్తులో లిఫ్ట్ ఆపరేటర్ మృతదేహాన్ని పోలీసులు శనివారంనాడు కనుగొన్నారు. మృతుని యూపీలోని అలీగఢ్‌కు చెందిన యోగేష్ కుమార్‌ (31)గా గుర్తించారు. ఫైర్ ఎగ్జిట్ స్టయిర్ కేస్ సమీపంలో అతని మృతదేహాన్ని ఆకాష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించాడు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, సహజ మరణంగానే అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎయిమ్స్‌కు పంపారు.


యోగేష్ గత నాలుగేళ్లుగా స్వస్తిక్ ఎలక్ట్రో‌టెక్ ప్రైవేట్ లిమిడెట్ ఉద్యోగిగా ఉన్నాడు. ఈ ఘటనపై డీసీపీ (సౌత్) బెనట మేరే జైకెర్ మాట్లాడుతూ, యేగేష్ తరచు మద్యం తీసుకునేవాడని, గత మూడు నాలుగు రోజులుగా పనికి కూడా సరిగా రాలేదని చెప్పారు. విధి నిర్వహణలో సరిగా లేకపోవడంతో లిఫ్ట్ ఆపరేటర్ పని నుంచి క్లీనింగ్ పనికి సూపర్‌వైజర్ మార్చాడని తెలిపారు. కాగా, గత వారం రోజుల్లో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఈవారం మొదట్లో ఢిల్లీ బార్ అసోసియేషన్‌ ఉద్యోగి (30) ఒకరు తీస్ హజారీ కోర్టు ఛాంబర్‌లో మృతదేహమై కనిపించాడు.

Updated Date - 2021-11-13T21:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising