ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆన్‌లైన్‌లో రమ్మీని నిషేధించేందుకు త్వరలో కొత్త చట్టం’

ABN, First Publish Date - 2021-08-05T03:21:43+05:30

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆటను నిషేధించేందుకు వీలుగా త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామని తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తాజాగా పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఆన్‌లైన్‌లో రమ్మీ ఆటను నిషేధించేందుకు వీలుగా త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామని తమిళనాడు న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తాజాగా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం కోసం అప్పటి అన్నాడీఎమ్‌కే ప్రభుత్వం తమిళనాడు గేమింగ్ యాక్ట్‌కు చేసిన సవరణను మద్రాస్ హైకోర్టు తాజాగా కొట్టేసిన విషయం తెలిసిందే. ఆటను నిషేధించేందుకు తగిన కారణాలను, ఇతర విధివిధానాలను ప్రభుత్వం ఈ సవరణలో స్పష్టంగా పేర్కొనలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే..కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఈ చట్టంలో తగు మార్పులు చేయాలని డీఎమ్‌కే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించినట్టు మంత్రి పేర్కొన్నారు. ‘‘ఈ మేరకు ఆన్‌లైన్ రమ్మీ ఆటను నిషేధిస్తూ త్వరలో ఓ కొత్త చట్టాన్ని తీసుకొస్తాము’’ అని మంత్రి రఘుపతి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-05T03:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising