ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Afghanistan: 6 మిలియన్ల అఫ్ఘాన్లను కాపాడేందుకే కాబూల్‌ను విడిచిపెట్టా...

ABN, First Publish Date - 2021-09-09T14:03:58+05:30

అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాజాగా అఫ్ఘాన్లకు క్షమాపణలు చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ క్షమాపణలు

దుబాయ్: అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాజాగా అఫ్ఘాన్లకు క్షమాపణలు చెప్పారు. గత నెలలో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకునే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి పారిపోయిన అష్రఫ్ ఘనీ అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్లినందుకు ప్రజలకు తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘‘తుపాకులు పేల్చకుండా ఉంచడంతోపాటు ఆరు మిలియన్ల అఫ్ఘాన్లను రక్షించడానికే నేను కాబూల్‌ను విడిచిపెట్టి వచ్చాను’’అని ఘనీ చెప్పారు.అఫ్ఘాన్ ప్రజలను అనిశ్చితికి వదిలేసి పారిపోయి వచ్చిన ఘనీపై విమర్శలు వెల్లువెత్తాయి. 


‘‘ఆగస్టు 15వతేదీన తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించిన తర్వాత వీధి పోరాటాలు జరిగే ప్రమాదం ఉందని ప్యాలెస్ సెక్యూరిటీ ఇచ్చిన సలహాతో నేను వదిలి వచ్చాను’’ అని ఘనీ ట్వీట్ చేశారు.‘‘కాబూల్‌ను విడిచిపెట్టడం నా జీవితంలో అత్యంత కష్టమైన నిర్ణయం, కానీ 6 మిలియన్ల పౌరులను రక్షించడం ఏకైక మార్గం అని నమ్ముతున్నాను’’ అని 72 ఏళ్ల మాజీ అధ్యక్షుడు తన తాజా ప్రకటనలో చెప్పారు.అఫ్ఘాన్ ప్రజల పట్ల తనకు నిబద్ధత తగ్గలేదని, జీవితాంతం తాను మార్గనిర్దేశం చేస్తానని ఘనీ పునరుద్ఘాటించారు.


Updated Date - 2021-09-09T14:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising