ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక విప్లవాల గడ్డ నేడు అవినీతిమయం: అమిత్‌షా

ABN, First Publish Date - 2021-03-08T02:00:43+05:30

డాలర్, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: డాలర్, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బీజేపీ నిర్వహించిన 'కేరళ విజయ యాత్ర' ముగింపు సందర్భంగా తిరువనంతపురంలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ర్యాలీలో అమిత్‌షా ప్రసంగించారు. పినరయి సర్కారుపై నిప్పులు చెరిగారు. సామాజిక విప్లవాలకు పురిటిగడ్డ అయిన కేరళ ఈరోజు అవినీతి, రాజకీయ హింస, దుష్టపాలనకు ఆలవాగంగా మారిందని విమర్శించారు. కేరళలో మార్పు తీసుకు వచ్చేందుకు 1,940 కిలోమీటర్ల మేరకు యాత్ర నిర్వహించి, 62 చోట్ల భారీ ర్యాలీలు, గ్రామాల్లో లెక్కకు మిక్కిలిగా ర్యాలీలు నిర్వహించామని, త్రివేండ్రంతో పరివర్తన యాత్ర ముగిసిందని చెప్పారు. ఇవాల్టి నుంచి ఆత్మనిర్భర్ కేరళ మిషన్ వైపు తామంతా పని చేస్తామని చెప్పారు.


సంపూర్ణ అక్షరాస్యత సాధించి, పర్యాటకరంగాన్ని ఒక పరిశ్రమగా మార్చిన ఘనత కేరళకే చెందుతున్నారు. అయితే, ఇవాళ రాష్ట్రాన్ని రాజకీయ హింస, అవినీతికి ఆలవాలంగా యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మార్చాయని తప్పుపట్టారు. యూడీఎఫ్ వచ్చినప్పుడు సోలార్ కుంభకోణం, ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ స్కామ్‌కు పాల్పడ్డాయని, అవినీతి విషయంలో రెండూ పోటాపోటీ పడుతున్నాయని అన్నారు.


మెట్రో శ్రీధరన్‌పై ప్రశంసలు

ఇటీవలే బీజేపీలో చేరిన 'మెట్రోమ్యాన్' ఇ.శ్రీధరన్‌పై అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. కొంకన్ రైల్వే అభివృద్ధి ద్వారా దక్షిణ భారతావనితో ఇతర ప్రాంతాలకు అనుసంధానం జరిగి అభివృద్ధి అనేది కేరళ వరకూ చేరందని అన్నారు. ఈ ప్రయాణంలో శ్రీధరన్ కీలక భూమిక పోషించారని అన్నారు. మౌలిక వసతుల డవపలర్, మన మెట్రో మ్యాన్‌ను దేశాభివృద్ధి కోసం బీజేపీ ఎంపిక చేసిందని చెప్పారు.

Updated Date - 2021-03-08T02:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising