ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమానా నాటి జీపు నడిపిన లాలూ

ABN, First Publish Date - 2021-11-24T21:08:00+05:30

జమానా నాటి రోజుల్లోకి ఆయన వెళ్లారు. ఏళ్ల క్రితం తొలిసారి ముచ్చటపడి కొనుక్కున్న జీపును బయటకు తీసి.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: జమానా నాటి రోజుల్లోకి ఆయన వెళ్లారు. ఏళ్ల క్రితం తొలిసారి ముచ్చటపడి కొనుక్కున్న తెలుపురంగు జీపును బయటకు తీసి... స్టీరింగ్ పట్టారు. పాట్నా వీధుల్లో ఉల్లాసంగా డ్రైవ్ చేస్తూ  వివహరించారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారంనాడు జీపు నడుపుతూ జనాల్లోకి వెళ్లినప్పటి దృశ్యం ఇది. ఆరోగ్య కారణాలు, పశుగ్రాసం కుంభకోణంలో జైలు జీవితం కారణంగా కొన్నేళ్లుగా ఆయన రాజకీయ జీవితానికి దూరంగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత పాతరోజులు గుర్తుచేసుకుంటూ ఆయన లక్నో వీధుల్లో జీపును డ్రైవ్ చేస్తూ ఆ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.


''నేను ఏళ్లక్రితం మొదటిసారి కొనుక్కొన్న జీపు ఇది. చాలాకాలం తర్వాత మళ్లీ ఇవాళ డ్రైవ్ చేశాను. ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ డ్రైవర్లే. ప్రేమ, సామరస్యం, సమత్యం, అభ్యుదయం, శాంతి, ఓరిమి, న్యాయం, సంతోషం ఇలా...అందరి జీవితంలోనూ వెహికల్ ఆఫ్ లవ్ నడుస్తుంటుంది'' అంటూ 73 ఏళ్ల లాలూ తన సంతోషం పంచుకున్నారు. లాలూ డ్రైవ్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్‌లో ఆర్జేడీ పోస్ట్ చేసింది. ఆసక్తికరంగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 15 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రేషన్లు జరుపుకొంటున్న తరుణంలో లాలూ 'జీప్'లో హల్‌చల్ చేయడం ఆర్జేడీ అభిమానులను సంబరంలో ముంచెత్తుతోంది.

Updated Date - 2021-11-24T21:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising