ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assam flood:950 గ్రామాలు ముంపు..వరదనీటిలో ఇద్దరి మునక

ABN, First Publish Date - 2021-08-31T12:52:29+05:30

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 21 జిల్లాలు వరదల వల్ల అతలాకుతలం అయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి : అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. అసోంలోని 21 జిల్లాలు వరదల వల్ల అతలాకుతలం అయ్యాయి. 3.63 లక్షల మంది వరదల బారిన పడ్డారు. బార్ పేట, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోయారు.బార్‌పేట, బిశ్వనాథ్, కచార్, చిరాంగ్, దరాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రుగర్, గోలాఘాట్, జోర్హాట్, కమ్రూప్, కర్బీ ఆంగ్‌లాంగ్ వెస్ట్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బారి, ఎస్ , సోనిత్పూర్, దక్షిణ సల్మారా, టిన్సుకియా జిల్లాల్లో 3.63 లక్షల మంది వరదల వల్ల అవస్థలు పడుతున్నారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. 


ఒక్క లఖింపూర్ జిల్లాలోనే దాదాపు 1.3 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో 30,333 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి.21 జిల్లాల్లోని 950 గ్రామాలు నీట మునగడంతో ప్రజల సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది.అసోంలో నదులు ప్రమాదస్థాయి కంటే మించి ప్రవహిస్తున్నాయి. అసోంలోని వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదనీటి ధాటికి బార్ పేట, దరాంగ్, గోలాఘాట్,చ మోరిగావ్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో 13 రోడ్లు కొట్టుకుపోయాయి.

Updated Date - 2021-08-31T12:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising