ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకున్న లేడీ డాక్టర్ రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2021-01-16T22:23:04+05:30

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. కోల్‌కత్తాలో కూడా వైద్యులకు, వైద్య సిబ్బందికి టీకాను ఇచ్చారు. ఈ సందర్భంగా.. కోల్‌కత్తా మెడికల్ కాలేజ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. కోల్‌కత్తాలో కూడా వైద్యులకు, వైద్య సిబ్బందికి టీకాను ఇచ్చారు. ఈ సందర్భంగా.. కోల్‌కత్తా మెడికల్ కాలేజ్‌లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళా వైద్యురాలు ప్రియాంక మైత్రా స్పందిస్తూ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తాను మునుపటిలానే ఆరోగ్యంగానే ఉన్నానని, తనలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఆమె చెప్పారు. మరో 28 రోజుల తర్వాత మరో డోస్ తీసుకోనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతా ముందుకు రావాలని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు. కోల్‌కత్తా మెడికల్ కాలేజ్‌లో వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ప్రియాంక మైత్రానే కావడం విశేషం.


ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు కనిపించడం గమనార్హం. సంగారెడ్డి పరిధిలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు లోనయింది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎంకు ఒక్కసారిగా బీపీ పెరిగిందని తెలిసింది. కొవిడ్‌ టీకా తీసుకున్న వెంటనే తల తిరిగినట్టుగా ఉండి, వాంతులు చేసుకోవడంతో ఆమెకు చికిత్స అందించారు. విజయవాడ జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ ఒకరు అస్వస్థతకు లోనయి.. వ్యాక్సిన్ వేసిన వెంటనే కళ్ళు తిరిగి అస్వస్థతకు గురైంది. అస్వస్థతకు గురైన హెల్త్‌ వర్కర్‌కు వైద్యులు చికిత్సనందించారు.

Updated Date - 2021-01-16T22:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising