ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికనేత శాంతరాజు కన్నుమూత

ABN, First Publish Date - 2021-04-14T17:30:50+05:30

అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్మికనేత శాంతరాజు సోమవారం కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



బెంగళూరు: అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్మికనేత శాంతరాజు సోమవారం కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. కోలుకుంటూ కన్నుమూశారు. 1970 జూలై 1న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సాధారణ క్లర్కుగా చేరిన శాంతరాజు 1977లో ట్రైనీ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు. బ్యాంకు అధికారుల ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ ప్రముఖ నాయకుడు ఆర్‌ఎన్‌ గాడ్బోలేకు ప్రధాన అనుచరుడైన శాంతరాజు బ్యాంకు అధికారుల సంఘంలో కర్ణాటకలోనూ, జాతీయస్థాయిలోనూ వివిధ హోదాలలో సేవలందించారు. దక్షిణకన్నడ విభాగానికి అధ్యక్షుడిగాను, అఖిల భారత స్టేట్‌బ్యాంకు అధికారుల సమాఖ్య కార్యదర్శిగాను, స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆఫీసర్స్‌ అధ్యక్షుడిగాను అనంతరం అఖిలభారత స్టేట్‌బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగాను సేవలందించారు. ఎస్‌బీఐ సెంట్రల్‌బోర్డులో రెండుసార్లు డైరెక్టర్‌గా వ్యవహరించారు. బ్యాంకు అధికారుల, సిబ్బంది సమస్యల పరిష్కారానికై ఆయన నిరంతరం పోరాటం చేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. శాంతరాజు మృతిపట్ల బ్యాంకు అధికారుల సమాఖ్య మంగళవారం తీవ్ర సంతాపం ప్రకటించింది.  

Updated Date - 2021-04-14T17:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising