ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యలో కురుక్షేత్రం!

ABN, First Publish Date - 2021-06-15T09:45:01+05:30

అయోధ్యలో భూ వివాదం రాజుకుంటోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భూ వివాదంపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూ వివాదంపై ప్రతిపక్షాల మండిపాటు

భూముల రేట్లు పెరిగాయి: చంపత్‌ రాయ్‌


అయోధ్య, జూన్‌ 14: అయోధ్యలో భూ వివాదం రాజుకుంటోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భూ వివాదంపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయోధ్యలో భూమి కొనుగోలుకు సంబంధించి రూ.16.5 కోట్ల మనీ లాండరింగ్‌ జరిగిందని సమాజ్‌వాదీ, ఆప్‌ నేతలు ఇప్పటికే ఆధారాలతో ఆరోపించిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది రామ భక్తులు విరాళాలుగా ఇచ్చిన సొమ్ము దుర్వినియోగమైందని ఆరోపించారు. వారి వివరాల ప్రకారం.. అయోధ్య జిల్లాలోని బాగ్‌ జైసీ గ్రామంలో కుసుమ్‌ పాఠక్‌కు 1.2 హెక్టార్ల భూమి ఉంది. మార్చి 18న సుల్తాన్‌ అన్సారీ దానిని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అదే రోజు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే దానిని సభ్యుడు అనిల్‌ మిశ్రాతో కలిసి రామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేశారు.


వీటిలో మొదటి కొనుగోలుకు స్టాంప్‌ పేపర్లను అదే రోజు సాయంత్రం 5.11 గంటలకు కొనుగోలు చేస్తే.. రెండో దానికి 5.22 గంటలకు కొన్నారు. తద్వారా, చంపత్‌ రాయ్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశం ఇప్పుడు దుమారం రేపుతోంది. రామభక్తుల విరాళాలను దుర్వినియోగం చేయడం మహా పాపమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘రామా.. ఇప్పుడు కంసులు పాలిస్తున్నా రు. సాక్షాత్తూ నీ పేరిట విరాళాలు తీసుకుని కుంభకోణాలకు పాల్పడుతున్నారు. సిగ్గులేని దోపిడీదొంగలు మత విశ్వాసాలనూ మార్కెట్లో అమ్మేస్తున్నారు’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. రామ భక్తులు కష్టపడి విరాళంగా ఇచ్చిన సొమ్ములను దుర్వినియోగం చేయరాదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. అయోధ్యలో స్కాం జరిగిందని, దీనిపై ట్రస్టు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయోధ్య మందిరాన్ని బీజేపీ, ఆరెస్సె్‌సలు వ్యాపార నిలయంగా మార్చేశాయని ఎస్బీఎస్పీ చీఫ్‌ రాజ్‌భర్‌ విమర్శించారు.  


భూముల రేట్లు పెరిగాయి: చంపత్‌ రాయ్‌

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భూముల ధరలు పెరిగాయని రామ జన్మభూమి ట్రస్ట్‌ తెలిపింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ సంతకంతో సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ట్రస్టుకు ఇప్పుడు అమ్మిన వాళ్లు కొన్నేళ్ల కిందట అగ్రిమెంట్లు చేసుకున్నారు. అప్పట్లో వారు కొన్న ధర తక్కువ. సేల్‌ డీడ్‌ రూపంలో దానిని వారు ట్రస్టుకు విక్రయించారు. అయోధ్యలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్న భూమి కూడా కీలకమైన రైల్వే స్టేషన్‌కు దగ్గర్లో ఉంది. అంతేనా, ట్రస్టు కొనుగోలు చేసిన భూమి అంతా మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువకే కొన్నాం’’ అన్నారు. ఇక, అప్రదిష్ఠ పాలు చేయడానికి కొందరు ఎటువంటి అవకాశాన్నీ వదులుకోరని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-15T09:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising