ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో Hero Vijay Fan Clubకి 100కు పైగా సీట్లు

ABN, First Publish Date - 2021-10-14T22:21:03+05:30

తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వందమందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ అభిమాన సంఘం నుంచి పోటీ చేసిన వందమందికిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన సీనియర్ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం, సీమన్‌కు చెందిన నామ్ తమిళియార్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయిన వేళ విజయ్ అభిమాన సంఘం దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ (టీవీఎంఐ) ఏకంగా వంద సీట్లకుపైగా గెలుచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  


ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ నెల 6న మొత్తం 39 యూనియన్లలో పోలింగ్ జరగ్గా, మిగిలిన 35 యూనియన్లలో 9న పోలింగ్ జరిగింది. 140 జిల్లా పంచాయతీ వార్డు సభ్యులు, 1,381 పంచాయతీ యూనియన్ వార్డు సభ్యులు, 2,901 గ్రామ పంచాయతీ అధ్యక్షులు, 22,581 గ్రామ పంచాయతీ వార్డు కౌన్సిలర్లు సహా మొత్తం 27,003 పోస్టుల కోసం ఎన్నికలు జరిగాయి. అలాగే, 74 పంచాయతీ యూనియన్లకూ ఎన్నికలు జరిగాయి. 


ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నటుడు విజయ్ నుంచి తొలిసారి దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ జెండాపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో విజయ్ ఫ్యాన్ క్లబ్ సభ్యుయలు విజయం సాధించారు. ఇటీవల విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభ సహా 11 మందికి నోటీసులు పంపారు.


బహిరంగ సభలు, సమావేశాల్లో తన పేరు వాడుకోవద్దని అందులో పేర్కొన్నారు. విజయ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ ఆయన తండ్రి ప్రకటించిన తర్వాత ఈ వివాదం రేకెత్తింది. అయితే, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజా గెలుపుపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  

Updated Date - 2021-10-14T22:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising