ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ ‘స్టోన్ మ్యాన్’ కలకలం...రాళ్ల దాడిలో ఒకరు మృతి!

ABN, First Publish Date - 2021-07-24T15:31:57+05:30

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మళ్లీ స్టోన్ మ్యాన్ దాడులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మళ్లీ స్టోన్ మ్యాన్ దాడులు పెరిగిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై వెళుతున్నవారు స్టోన్ మ్యాన్ బారిన‌పడి, గాయాలపాలవుతున్నారు. ఇటువంటి ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎక్కడుంటాడు? అనే వివరాలు ఈనాటికీ పోలీసులు తెలుసుకోలేకపోయారు. నగరంలో ఇటువంటి దాడులు తరచూ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. 


తాజాగా ఇటువంటి ఘటన ఉత్తర కోల్‌కతాలోని బీకే పాల్ ఎవెన్యూలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న 26 ఏళ్ల ఓం ప్రకాష్ రోడ్డు పక్కన ఒక హోటల్ నడుపుతున్నాడు. రాత్రి ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. అతనిపై స్టోన్ మ్యాన్ దాడిచేశాడు. రాళ్లతో ఓం ప్రకాష్ తలపై కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. మర్నాటి ఉదయం ఓం ప్రకాష్ పరిస్థితిని చూసిన అతని కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఓం ప్రకాష్ కన్నుమూశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఓం ప్రకాష్ కన్నుమూశాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా కుటుం సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1989లోనూ కోల్‌కతాలో స్టోన్ మ్యాన్ దాడులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఇటువంటి సంఘటనల్లో 13 మంది మృతి చెందారు. 

Updated Date - 2021-07-24T15:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising