ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిప్రమాదం మృతులకు ప్రధాని రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN, First Publish Date - 2021-03-09T15:31:52+05:30

కోల్‌కతాలోని 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని 13 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  స్ట్రాండ్ రోడ్డులోని ఈస్ట్రన్ రైల్వే భవంతిలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు రైల్వే సిబ్బంది, ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సహా తొమ్మిది మంది మృతి చెందారు.


రూ.10 లక్షలు ప్రకటించిన మమత

కాగా, ప్రమాద స్థలికి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చెలరేగడంతో 6.30 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి.

Updated Date - 2021-03-09T15:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising