ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలకి కట్టుతో కనిపించిన కిమ్ జోంగ్ ఉన్!

ABN, First Publish Date - 2021-08-03T20:58:01+05:30

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తలకి ముదురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తలకి ముదురు ఆకుపచ్చ రంగులోని మచ్చ, బ్యాండేజి కనిపించడం అందరినీ ఆలోచనల్లో పడేసింది. జూలై 24 నుంచి 27 వరకు ఆయన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆయన తలకు వెనుక భాగంలో మచ్చ, బ్యాండేజ్ కనిపించాయని ఎన్‌కే న్యూస్ సైట్ వెల్లడించింది. ఆయన జూలై 27 నుంచి 29 వరకు పాల్గొన్న మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా కనిపించారని పేర్కొంది. 


కిమ్ తల వెనుక భాగంలో తపాలా స్టాంపు పరిమాణంలో ముదురు ఆకుపచ్చ రంగులో మచ్చ లేదా వాపు కనిపించినట్లు తెలిపింది. ఈ మచ్చను బ్యాండేజితో కప్పి ఉంచినట్లు పేర్కొంది. దీనికి కారణాలను ఫొటోల ద్వారా నిర్థరించడం కష్టమని పేర్కొంది. జూన్ 29న ఆయన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నపుడు ఈ మచ్చ కనిపించలేదని పేర్కొంది. జూలై 11న ఆయన మ్యుజిషియన్లతో కలిసి కనిపించినపుడు విడుదల చేసిన ఫొటోలలో ఆయన తల వెనుక భాగాన్ని చూపించలేదని తెలిపింది. 


ఇదిలావుండగా, దక్షిణ కొరియా జాతీయ నిఘా సేవల విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియాలో అసాధారణ పరిస్థితులేవీ కనిపించలేదు. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక విషయాలేవీ లేవు. కొద్ది రోజులపాటు కనిపించిన ప్యాచ్‌ను ఆ తర్వాత తొలగించారని, ఆ స్థానంలోని మచ్చ కూడా కనిపించలేదని తెలుస్తోంది. ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. 


Updated Date - 2021-08-03T20:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising