ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళీయుల దాతృత్వం... వ్యాక్సిన్ల కొనుగోలుకు విరాళాల వెల్లువ...

ABN, First Publish Date - 2021-04-23T22:39:02+05:30

కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను నేరుగా తయారీదారుల నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను నేరుగా తయారీదారుల నుంచి కొనుక్కోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కేరళీయులు ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యాక్సిన్లను అందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో వేలాది మంది కేరళీయులు చీఫ్ మినిస్టర్స్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్)కు ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. 


ఈ విరాళాల ఉద్యమం బుధవారం రాత్రి ప్రారంభమైంది. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా దీనిని ప్రారంభించారు. తాము వ్యాక్సిన్ వేయించుకున్నామని, తాము సీఎండీఆర్ఎఫ్‌కు విరాళాలు ఇస్తామని ప్రకటించారు. దీనిని ఆదర్శంగా తీసుకుని వేలాది మంది స్పందిస్తూ, విరాళాలు ఇస్తున్నారు. కొందరు తమ విరాళాల సర్టిఫికేట్లను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. 


ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికైనా ప్రజల మద్దతే తమకు బలమని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్‌లను ఉచితంగానే అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అందుకు ప్రతిఫలంగా ప్రజలు ప్రభుత్వానికి సహాయపడాలనుకుంటున్నారని తెలిపారు. 



Updated Date - 2021-04-23T22:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising