ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

COVID బాధిత కుటుంబాలకు నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్

ABN, First Publish Date - 2021-10-14T13:25:12+05:30

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేరళ సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం (కేరళ): కరోనా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేరళ సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారితో మరణించిన నిరుపేద కుటుంబాలకు నెలకు 5వేల రూపాయల చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయించారు. ఈ మేర కేరళ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మృతుల్లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలను ఆదుకునేందుకు ఈ అదనపు ఆర్థికసాయం అందించాలని కేరళ కేబినెట్ నిర్ణయించింది.



 కేరళ వాసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మరణించినా బీపీఎల్ కేటగిరి కుటుంబం అయితే వారికి మూడేళ్ల పాటు నెలకు 5వేల రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని నిర్ణయించారు.ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పెన్షన్ పొందటానికి అనర్హులని కేరళ సర్కారు వెల్లడించింది. కొవిడ్ తో మరణించిన వారి పిల్లలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేస్తే వారికి ఆర్థిక సాయం అందిస్తామని సర్కారు వివరించింది. 

Updated Date - 2021-10-14T13:25:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising