ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zika virus:కేరళలో కలకలం

ABN, First Publish Date - 2021-07-12T14:31:53+05:30

కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కలవరం సృష్టిస్తోంది. తాజాగా మరో మూడు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కలవరం సృష్టిస్తోంది. తాజాగా మరో మూడు జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 18కి పెరిగింది. 22 ఏళ్ల యువకుడు, 46 ఏళ్ల వ్యక్తి, మరో 29 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త  జికా వైరస్ బారిన పడ్డారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు.జికా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తిరువనంతపురం, త్రిస్సూర్, కోజికోడ్ మెడికల్ కళాశాలలు, అల్లప్పుజా వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లలో జికా వైరస్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వీణా చెప్పారు. ఆదివారం 35 శాంపిళ్లను పరీక్షించగా మూడు జికా వైరస్ కేసులు వెలుగుచూశాయని మంత్రి చెప్పారు. పూణే నగరంల నుంచి 2,100 టెస్ట్ కిట్లు వచ్చాయని, వీటిని తిరువనంతపురం, అల్లప్పుజా, త్రిస్సూర్, కోజికోడ్ లకు పంపించామని కేరళ వైద్యాధికారులు చెప్పారు.జ్వరం, రాషెష్, ఒళ్లు నొప్పులుంటే వారికి జికా వైరస్ పరీక్షలు చేయాలని మంత్రి ఆదేశించారు.ఆరుగురు నిపుణులతో కూడిన కేంద్ర వైద్యుల బృందం జికా వైరస్ పరిశీలన కోసం కేరళ రాష్ట్రంలో పర్యటించింది.

Updated Date - 2021-07-12T14:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising