ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే నెలలో తెరచుకోనున్న కేదార్‌నాథ్, బదరీనాథ్ దేవాలయాలు

ABN, First Publish Date - 2021-03-12T16:13:32+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బదరీనాథ్ దేవాలయాలను మే నెలలో తెరవాలని ఉత్తరాఖండ్ ఛార్‌థామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు ప్రకటించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బదరీనాథ్ దేవాలయాలను మే నెలలో తెరవాలని ఉత్తరాఖండ్ ఛార్‌థామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు ప్రకటించింది. కేదార్ నాథ్ దేవాలయాన్ని మే 17వతేదీన భక్తుల సందర్శన కోసం తెరుస్తామని ఛార్‌థామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు అధికార ప్రతినిధి వెల్లడించారు.ఉఖీమఠ్ ఓంకారేశ్వర్ దేవాలయాన్ని మే 14వతేదీన తెరుస్తామని తెలిపారు.గత ఏడాది నవంబరు 19వతేదీన మూసివేసిన బదరీనాథ్ దేవాలయాన్ని మే 18వతేదీన తెరుస్తామని బోర్డు అధికార ప్రతినిధి చెప్పారు. 


గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను మే 14వతేదీన తెరుస్తామని ఛార్ థామ్ బోర్డు వివరించింది. కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను తెరిచిన తర్వాత ఛార్ థామ్ యాత్ర ప్రారంభిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. హిమాలయ పర్వతాల్లోని కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను మంచు వల్ల ప్రతీఏటా ఆరునెలల పాటు మూసి ఉంచుతారు. 

Updated Date - 2021-03-12T16:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising