ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కావేరిలో స్నానాలపై నిషేధం

ABN, First Publish Date - 2021-08-01T15:29:27+05:30

ఆడి పెరుక్కు, ఆడి అమావాస్య పర్వదినాల్లో కావేరి పరీవాహక ప్రాంతాల్లో స్నానాలపై నిషేధం విధించారు. రాష్ట్రంలో తమిళులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే పం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): ఆడి పెరుక్కు, ఆడి అమావాస్య పర్వదినాల్లో కావేరి పరీవాహక ప్రాంతాల్లో స్నానాలపై నిషేధం విధించారు. రాష్ట్రంలో తమిళులు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే పండుగలలో ఒకటైన ఆడి మాసం ఉత్సవాలు ఈ నెల 16వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 3వ తేదీ ఆడి పెరుక్కు పండుగ సందర్భంగా భక్తులు కావేరి నదిలో దిగి స్నానమాచరించడం ఆనవాయితీ. అదేవిధంగా 8వ తేదీ ఆడి అమావాస్య సందర్భంగా పితరులకు నీటి పరివాహక ప్రాంతాల్లో తర్పణం వదిలి మొక్కులు చెల్లించుకుంటారు.. ఆడి మాసం 28వ రోజైన 13వ తేదీ కూడా కావేరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే, రాష్ట్రప్రభుత్వం శనివారం ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల సేలం జిల్లాలోని నీటి పరీవాహక ప్రాంతాల్లో స్నానాలపే నిషేధించినట్లు జిల్లా కలెక్టర్‌ వీర్‌ప్రతా్‌పసింగ్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-01T15:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising