ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడి నుంచి వస్తున్నారా..? నెగెటివ్ రిపోర్ట్ తేవాల్సిందే: కర్ణాటక

ABN, First Publish Date - 2021-08-01T04:55:34+05:30

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కఠిన నిబంధనలను అవలంబిస్తోంది. రాష్ట్రంలో నిబంధనలను అవలంబించడమే కాకుండా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కఠిన నిబంధనలను అవలంబిస్తోంది. రాష్ట్రంలో నిబంధనలను అవలంబించడమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయిని ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా మరో ముందడుగు వేస్తూ ఇంకో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, మహారాష్ట్రల నుంచి కర్ణాటకు వచ్చేవారు తమ వెంట కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాలని, అప్పుడే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అది కూడా ర్యాపిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కాదని, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్‌ను కలిగి ఉండాలని సూచించింది. రైలు, రోడ్డు, విమానాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనను పాటించాలని, లేకపోతే రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.


కాగా.. ఇంతకుముందు ఓ డోసు వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు ఎవరైనా ఆధారాలు చూపెడితే వారిని రాష్ట్రంలోకి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. కానీ తాజా నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ నెగెటివ్ రిపోర్ట్ కలిగి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.

Updated Date - 2021-08-01T04:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising