ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రను దాటేసిన కర్ణాటక

ABN, First Publish Date - 2021-05-12T00:53:25+05:30

కరోనా రెండో వేవ్‌తో గిలగిల్లాడిపోతున్న కర్ణాటకలో నేడు రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. నేడు ఏకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా రెండో వేవ్‌తో గిలగిల్లాడిపోతున్న కర్ణాటకలో నేడు రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. నేడు ఏకంగా 39,305 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు అత్యధిక కేసులతో ఈ జాబితాలో ముందున్న మహారాష్ట్రను కర్ణాటక దాటేసింది. మహారాష్ట్రలో 37,236 కేసులు వెలుగు చూశాయి.  


120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఈ ఉదయం బెంగళూరు శివారులోని వైట్‌ఫీల్డ్‌కు చేరుకుంది. కర్ణాటకకు ఈ స్థాయిలో ఆక్సిజన్ అందడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు ఆక్సిజన్ అందుబాటులో లేక మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యం లభించింది. 


సాధారణంగా గూడ్స్ రైళ్ల ప్రయాణం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లు, స్పీడ్ రైళ్లకు దారిచ్చేందుకు చాలా స్టేషన్లలో వీటిని నిలిపి వస్తుంటారు. అయితే, ఈ రైలుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎక్కడా ఆపాల్సిన అవసరం రాలేదని, కాబట్టే త్వరగా బెంగళూరు చేరుకుందని బెంగళూరు డీఆర్ఎం అశోక్ కుమార్ వర్మ తెలిపారు. 


బెంగళూరులోని ఆసుపత్రుల్లో చాలా వరకు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. సకాలంలో ఆక్సిజన్ అందక చాలామంది మృత్యువాత పడుతున్నారు. బెడ్లు దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాస్తంత మెరుగైన వారిని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి యడియూరప్ప వైద్యులకు సూచించారు.   

Updated Date - 2021-05-12T00:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising