ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly సాక్షిగా... సంస్కారంలేని చర్యలు

ABN, First Publish Date - 2021-11-23T17:41:23+05:30

నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు, అభివృద్ధి దిశా నిర్దేశంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిపై అసెంబ్లీ సాక్షిగా కొందరు సంస్కారంలేని రీతిలో వ్యవహరించారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బెంగళూరు: నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన రాజకీయాలు, అభివృద్ధి దిశా నిర్దేశంగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రిపై అసెంబ్లీ సాక్షిగా కొందరు సంస్కారంలేని రీతిలో వ్యవహరించారని, మహిళలపట్ల సిగ్గులేకుండా మాట్లాడారని బెంగళూరు కమ్మవారి సంఘం ప్రతినిధులు మండిపడ్డారు. సోమవారం నగరంలోని కమ్మవారి సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సంఘం అధ్యక్షుడు రాజగోపాలనాయుడు, ఉపాధ్యక్షులు ఎం రుక్మాంగదనాయుడు, లోకనాథనాయుడు, ప్రధాన కార్యదర్శి లీలాశంకర్‌రావు, సంయుక్త కార్యదర్శులు వేణుగోపాలనాయుడు, రాజేంద్రనాయుడు, కోశాధికారి నీరజాక్షులునాయుడు, యోగమూర్తి మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుతోపాటు ఆయన భార్యపై వైసీపీకి చెందిన మంత్రులు దిగజారేలా మాట్లాడారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన జరిగాక నిలువనీడలేకుండా కట్టుబట్టలతో తరిమేస్తే... చంద్రబాబునాయుడు చెక్కుచెదరని విశ్వాసంతో రాష్ట్ర అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయలేదా..? అన్నారు. రెండున్నరేళ్లుగా చంద్రబాబు కుటుంబంపై కక్షగట్టి నిరంతరంగా అవమానం చేస్తున్నారని అన్ని విధాలా హింసలను రాష్ట్ర, దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు సతీమణిపై కొందరి వ్యాఖ్యలు మమ్మల్ని కలచివేశాయని, చలించిపోయామన్నారు. కమ్మవారిసంఘం కమిటీ సభ్యులు, కర్ణాటక రాష్ట్ర కమ్మసోదరులు ఈ దారుణ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్టీరామారావు క్రమశిక్షణకు, నీతికి, నిజాయతీకి ఆదర్శాలకు మార్గదర్శకులని, ఆ కుటుంబానికి చెందిన మహిళపై నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. మీడియా సమావేశంలో సంఘం డైరెక్టర్లు జగదీశ్‌, రమణ, ఎం సుధాకర్‌, జీవీ రమేశ్‌, చంద్రశేఖర్‌బాబు, కృష్ణమనాయుడుతోపాటు పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T17:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising