ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Indiaకి కర్ణాటక బీజేపీ గేట్ వే...

ABN, First Publish Date - 2021-11-11T13:22:19+05:30

కర్ణాటక సీఎం బొమ్మై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం బొమ్మై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశానికి కర్ణాటక బీజేపీ గేట్‌వే లాంటిదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు. కేరళ మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తమ బీజేపీ భిన్నంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుందని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా బీజేపీ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపిందని తాజాగా జరిగిన ఓ మీట్‌లో సీఎం చెప్పారు.దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఉన్న అవకాశాల గురించి అడిగిన ప్రశ్నలకు సీఎం బొమ్మై సమాధానం ఇచ్చారు. 


‘‘బీజేపీకి దక్షిణ భారతదేశం ఆశాజనకంగా ఉంది...బీజేపీకి కర్ణాటక ఒక గేట్‌వే. తెలంగాణలో బీజేపీపై ప్రజలకు ఆశలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా ప్రభావం చూపించాం.’’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీని వ్యాప్తి చేయడానికి చాలా మంది బీజేపీ నాయకులు గత 30 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారని సీఎం చెప్పారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం యాదృచ్ఛికంగా రాలేదని బొమ్మై అన్నారు. వివిధ రంగాల్లో ఎన్నో ఏళ్లుగా బీజేపీ నేతలు కష్టపడాల్సి వచ్చిందని సీఎం వివరించారు.


‘‘బీఎస్ యడియూరప్ప, అనంత్ కుమార్ వంటి పలువురు నేతలు కర్ణాటకలో కష్టపడి పనిచేశారు. అదేవిధంగా తమిళనాడు, కేరళలో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా బీజేపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు’’ అని సీఎం తెలిపారు.మార్పు కోసం సమయం వచ్చినప్పుడు బీజేపీకి అవకాశం ఉంటుందని బొమ్మై నొక్కి చెప్పారు.


Updated Date - 2021-11-11T13:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising