ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: మేం లంచాలు తీసుకోం..

ABN, First Publish Date - 2021-10-27T17:54:04+05:30

లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలోని ఏశాఖలోనూ ఫైలు కదలదనే విధానం దేశంలోని ప్రతి చోటా సాధారణమైంది. ఇందుకు కర్ణాటక రాష్ట్రం ఏం ప్రత్యేకం ఏమీ కాదు. వీటికి భిన్నంగా రాష్ట్ర సచివాలయ కేంద్రం విధానసౌధలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - విధానసౌధ ఉద్యోగుల తీర్మానం


బెంగళూరు(Karnataka): లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలోని ఏశాఖలోనూ ఫైలు కదలదనే విధానం దేశంలోని ప్రతి చోటా సాధారణమైంది. ఇందుకు కర్ణాటక రాష్ట్రం ఏం ప్రత్యేకం ఏమీ కాదు. వీటికి భిన్నంగా రాష్ట్ర సచివాలయ కేంద్రం విధానసౌధలో ఇకపై మేం లంచాలు తీసుకోం అంటూ ఉద్యోగులు తీర్మానించారు. మంగళవారం విధానసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఛీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతూ మన దేశంలో ఆర్థిక రాజకీయ సమాజిక అభివృద్ధికి లంచాలు, అవినీతి ఒక అడ్డంకి మారిందని నమ్ముతున్నాను. ఉద్యోగులు ప్రతిజ్ఞ ఇలా చేశారు. జీవితంలో అన్ని రంగాలలోను నిజాయితీ, చట్ట నిబంధనలు పాటిస్తానని లంచం తీసుకునేది లేదని ఎట్టి పరిస్థితిలోను ఇచ్చేది లేదు. అన్ని పనులు ప్రామాణికత, పార దర్శకత రీతిలో నిర్వహిస్తానని ప్రజల ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తాను. వ్యక్తిగతంగా నిబద్దత ప్రదర్శించడం ద్వారా ఆదర్శంగా ఉంటాను. ఎటువంటి అవినీతి విషయమైనా సంబంధిత సంస్థకు సమాచారం ఇస్తానంటూ శపథం పూనారు. ప్రభుత్వ కార్యాలయాలంటూనే లంచాలకు కేంద్రాలు అనే నానుడిని రూపు మాపేందుకు విధానసౌధ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం స్వాగతించే విషయమని పలువురు పాలకులు, ప్రజా సంఘాలు అభిప్రాయపడ్డాయి. 

Updated Date - 2021-10-27T17:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising