ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: మొహర్రం ఊరేగింపులపై నిషేధాస్త్రం

ABN, First Publish Date - 2021-08-13T12:17:08+05:30

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొహర్రం ఊరేగింపులను నిషేధిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఉత్తర్వులు

బెంగళూరు(కర్ణాటక): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొహర్రం ఊరేగింపులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం పండుగ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 20వతేదీ వరకు ఆలం, పంజా, పీర్ల ఊరేగింపులను నిషేధిస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ మసీదుల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సర్కారు సూచించింది. కమ్యూనిటీహాళ్లు, మైదానాలు, షాదీ మహల్ లలో ప్రార్థనలను నిషేధించామని సర్కారు పేర్కొంది. 


ఖబరిస్థాన్ లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించమని, పదేళ్ల లోపు, 60 ఏళ్ల పైబడిన వారంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచించారు.కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గణేశ్ చతుర్థి పండుగపై కూడా సర్కారు ఆంక్షలు విధించింది.గణేశ్ మండపాలు ఏర్పాటు చేయరాదని, వినాయక విగ్రహాలను కొవిడ్ నిబంధనల పాటిస్తూ నిర్ణీత చెరువుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని అధికారులు కోరారు.గణేశ్ చతుర్థి సందర్భంగా దేవాలయాల్లో శానిటైజేషన్, థర్మల్ చెకింగ్ చేయాలని సర్కారు ఆదేశించింది. 

Updated Date - 2021-08-13T12:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising