ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకొద్దీ టీకా.. అంటూ కర్ణాటకలో జనం పరుగులు..

ABN, First Publish Date - 2021-06-24T16:55:06+05:30

కర్ణాటక: కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ అంటే కొన్ని వర్గాల్లో భయం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక: కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ అంటే కొన్ని వర్గాల్లో భయం కొనసాగుతోంది. టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. అధికారులు వస్తే ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. కొందరైతే అధికారులపై అంతెత్తున ఎగురుతున్నారు. కర్ణాటకలోని యాద్గీర్ జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. యాద్గీర్ జిల్లా,  కంచగరహల్లిలో 15వందల గడపలున్నాయి. టీకాలు వేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆ ఊరిలో శిబిరం ఏర్పాటు చేశారు. టీకా అంటే భయపడిన జనం.. వద్దంటూ పరుగులు తీస్తున్నారు. మధ్యాహ్నం వరకు చూసిన అధికారులు విస్తుపోయారు. వారిలో అపోహలను పోగొట్టేందుకు అధికారులు స్వయంగా ఇళ్లవద్దకు వెళ్లారు.


అధికారులు ఎంతగా నచ్చజెప్పినా జనం మాత్రం వినలేదు. కొందరు తమ ఇళ్లకు తాళం వేసుకుని వెళ్లిపోవడం కనిపించింది. వారితో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నిస్తే వద్దంటే వద్దని మహిళలు వెళ్లిపోయారు. ఒక ఇంటి బయట కొందరు మహిళలు భోజనం చేస్తున్నారు. అధికారులను చూడగానే వారు టీకాలు వేయడానికే వచ్చారని గ్రహించిన వారు తిట్ల దండకం అందుకున్నారు. దాంతో గత్యంతరం లేక అధికారులు వెనుదిరిగారు.

Updated Date - 2021-06-24T16:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising