ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్ నేత రాజీనామా.. కాంగ్రెస్‌పై మరోసారి కపిల్ సిబల్ విసుర్లు

ABN, First Publish Date - 2021-08-16T19:14:33+05:30

శతాధిక పార్టీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీతో ప్రయాణించిన సుస్మితా దేవ్.. తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శతాధిక పార్టీ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీతో ప్రయాణించిన సుస్మితా దేవ్.. తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆమె ఒక లేఖ రాశారు. అయితే తాను పార్టీ వీడటానికి ఏ కారణాన్నీ ఆమె తన లేఖలో వివరించలేదు.


దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు చేశారు. ‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. యువనేతలు పార్టీని ఒకపక్క వీడుతుంటే.. పార్టీ బలోపేతానికి చేసే కృషిపై మా ‘ముసలాళ్ల’ను నిందిస్తారు. అదే సమయంలో పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని సాగిపోతోంది’’ అంటూ కపిల్ సిబల్ మండిపడ్డారు. సుస్మిత రాజీనామాపై మరో సీనియర్ నేత మనీష్ తివారీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ వీడటానికి ఆ తేలికపాటి ఉత్తరం వివరణ సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.



Updated Date - 2021-08-16T19:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising