ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanniyakumariలో వర్షబీభత్సం

ABN, First Publish Date - 2021-10-18T18:04:33+05:30

కన్నియాకుమారి జిల్లాలో రెండు రోజులుగా కురి సిన కుండపోత వర్షాలకు జనజీ వనం స్తంభించింది. పల్లపు ప్రాం తాలన్నీ నీట మునిగాయి. ఆ జిల్లాలోని 25 గ్రామాలు జలది గ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నా యి. ఈ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదిగ్బంధంలో 25 గ్రామాలు

చెన్నై: కన్నియాకుమారి జిల్లాలో రెండు రోజులుగా కురి సిన కుండపోత వర్షాలకు జనజీ వనం స్తంభించింది. పల్లపు ప్రాం తాలన్నీ నీట మునిగాయి. ఆ జిల్లాలోని 25 గ్రామాలు జలది గ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నా యి. ఈ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. గత రెండు వారా లుగా కన్నియాకుమారి జిల్లాలో రుతుపవనాల ప్రభావం, అరేబి యా సముద్రంలో అల్పపీడనాల కారణంగా చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. దీనితో ఆ జిల్లాలోని జలాశయాలన్నీ నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్‌కోవిల్‌ రైల్వే కాలనీ, పరైకాల్‌ మఠం వీథి తదితర ప్రాంతాల్లో ఆదివారం వేకువజామున కురిసిన భారీ వర్షాలకు ఇళ్ళన్నీ నీటమునిగాయి. పలు నివాసప్రాంతాలు దీవులుగా మారాయి. అగస్తీశ్వరం తాలూకాలో మూడిళ్ళు, కల్‌కుళం, విలవంగోడు ప్రాంతాల్లో రెండిళ్ళు నేలకూ లాయి. నాగర్‌కోవిల్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్దనున్న ఓ చెట్టు కూలిపడింది. భారీ వర్షాల కారణంగా పేచ్చిపారై, పెరుంజాని, సిట్రారు డ్యామ్‌లలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరు కోవడటంతో వాటినుంచి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు. ఆ డ్యామ్‌ల నుంచి వెలువడుతున్న అదనపు జలాల వల్ల కోదైయారు, వళ్ళియారు, పరళియారు వాగుల లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాం తాల్లో 25 గ్రామాలు నీట మునిగాయి. అంజలి కడవు ప్రాంతంలో వరదనీటిలో మునిగిన ప్రజలను అగ్నిమాపకదళం సభ్యు లు కాపాడారు. తెరిసనంకోప్పు, అరుమ నెల్లూరు, పూదపాండి ప్రాంతాల్లోని రహదారు లన్నీ వరదనీటిలో మునిగాయి. కీరిపారై వద్ద  వరదనీటిలో మునిగి చిత్తిరై వేల్‌ (39) అనే వ్యక్తి మృతి చెందాడు. కడియపట్టినం చెక్‌డ్యామ్‌ వద్ద స్నానానికి వెళ్ళిన నిషాన్‌ (17) అనే యువకుడు, జెబిన్‌(18) అనే యువకుడు మృతి చెందారు. అగ్నిమాపక దళం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి ఇరువురి మృతదేహాలను వెలికి తీశారు. తెన్‌కాశి జిల్లాలోనూ గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. రహదారుల్లో వరదనీరు ఉదృతంగా ప్రవహిం చడంతో వాహనాల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది.


తీరం పొడవునా అలజడి

ఇదిలా వుండగా ఆదివారం ఉదయం కన్నియాకుమారి సముద్రతీరం పొడవునా రాక్షస అలలు ఎగసిపడ్డాయి. దీనితో పర్యాట కులు భయంతో పరుగులు తీశారు. గత మూడు రోజులుగా కన్నియాకుమారిలో భారీ గా వర్షాలు కురిశాయి. వర్షాన్ని లెక్క చేయ కుండా సెలవుదినమైన ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు విచ్చేశారు. ఆ సందర్భంగా సముద్రతీరంలో మూడు నాలుగు మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడ్డాయి. తీరంలో ఉన్న బండరాళ్ళవైపు అలలు దూసుకువచ్చాయి. దీనితో కడలి తీరంలో సూర్యోదయాన్ని తిలకించేందుకు నిలిచిన పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఇదేవిధంగా వావతురై, చిన్నముట్టం, ఆరోగ్యపురం, కోవళం, కీల్‌మనక్కుడి, మన క్కుడి, పళ్లం సహా పది ప్రాంతాల్లోనూ తీరం పొడవునా అలజడి అధికమైంది.

Updated Date - 2021-10-18T18:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising