ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమల్‌ అభిమానుల్లో టెన్షన్.. కోయంబత్తూర్ సౌత్‌లో ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..

ABN, First Publish Date - 2021-05-02T17:23:37+05:30

సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా చేస్తానంటూ తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్.. కోయంబత్తూర్ సౌత్‌లో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోయంబత్తూర్: సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా చేస్తానంటూ తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్.. కోయంబత్తూర్ సౌత్‌లో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆదివారం వెలువడుతున్న ఫలితాల్లో ఆయన స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా ఆయనకు 4293 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మయూర ఎస్ జయశంకర్‌కు 4409 ఓట్లు పోలయ్యాయి. డీఎంకేతో పొత్తులో భాగంగా మయూర ఎస్ జయశంకర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక బీజేపీ అభ్యర్థికి అక్కడ 2900 ఓట్లు పోలయ్యాయి. మయూర ఎస్ జయశంకర్ కు, కమల్ హసన్ కు మధ్య స్వల్ప తేడానే ఉంది. ప్రస్తుతం మయూర ఎస్ జయశంకర్ 116 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఆయన ఆధిక్యం తక్కువగానే ఉండటంతో కమల్ గెలుస్తారా? లేక మళ్లీ మయూర గెలుస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా, 2008లో డీలిమిటేషన్ జ‌రిగిన అనంతరం ఈ సీటులో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఆ రెండు ప‌ర్యాయాల్లోనూ ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఈసారి ఏఐడీఎంకే-బీజేపీలు కూటమిగా ఏర్పడిన నేప‌ధ్యంలో ఈ సీటు బీజేపీ చేతిలోకి వెళ్లింది. అటు డీఎంకే కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. దీంతో ఈసారి ఈ సీటును మయూరా జయకుమార్ కేటాయించారు. ఇక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారారు. 



Updated Date - 2021-05-02T17:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising