కమల్‌హాసన్ ఆస్తులు 177 కోట్లు
ABN, First Publish Date - 2021-03-17T07:41:36+05:30
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి న అభ్యర్థుల్లో నంబరు-2 ధనవంతుడిగా ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ నేత, సినీనటుడు కమల్‌హాసన్
చెన్నై,మార్చి 16(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి న అభ్యర్థుల్లో నంబరు-2 ధనవంతుడిగా ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ నేత, సినీనటుడు కమల్‌హాసన్ నిలిచారు.కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన నామినేషన్ పత్రాల్లో తనకు రూ.177 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, రూ.49.5కోట్ల అప్పులు ఉన్నాయని, గతేడాది తన సంపాదన రూ.22 కోట్లని వివరించారు. 8వ తరగతి వరకు చదువుకున్నానని పేర్కొన్నారు. రూ.206 కోట్ల ఆస్తులతో చెన్నైలోని అన్నానగర్ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్ నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో కెల్లా అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక సీఎం ఎడప్పాడి పళనిస్వామి తనకు రూ.6.61 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు నామినేషన్‌లో పేర్కొన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ రూ.4.94 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
Updated Date - 2021-03-17T07:41:36+05:30 IST