ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి భత్రతా సిబ్బందిపై సెక్స్ ట్రాఫికర్ల దాడి

ABN, First Publish Date - 2021-12-14T02:40:23+05:30

రాజస్తాన్‌లోని బ్రోతల్ హౌస్ నుంచి నలుగురు మైనర్ బాలికలను కాపాడుతున్న క్రమంలో సెక్స్ ట్రాఫికర్లు, బ్రోతలు ఓనర్లు నా సహచరులు, పోలీసు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మా వాళ్లను విపరీతంగా కొట్టారు. మావాళ్లు కాపాడిన బాలికల వయసు 11 ఏళ్లు మాత్రమే ఉంటాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సహచరులతో పాటు భద్రతా నిమిత్తం వచ్చిన పోలీసులపై సెక్స్ ట్రాఫికర్లు, బ్రోతలు ఓనర్లు దాడికి పాల్పడ్డారు. రాజస్తాన్‌లో సోమవారం జరిగిందీ దారుణం. బలవంతంగా పడుపు వృత్తిలోకి మైనర్ బాలికలను దింపుతున్నారని సమాచారం అందుకుని వారిని రక్షించడానికి వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తన సహచరులు, భద్రతా సిబ్బందిపై సెక్స్ ట్రాఫికర్లు, బ్రోతలు ఓనర్లు చేసిన దాడికి సంబంధించిన చిత్రాలను కైలాష్ సత్యార్థి షేర్ చేశారు.


అనంతరం ‘‘రాజస్తాన్‌లోని బ్రోతల్ హౌస్ నుంచి నలుగురు మైనర్ బాలికలను కాపాడుతున్న క్రమంలో సెక్స్ ట్రాఫికర్లు, బ్రోతలు ఓనర్లు నా సహచరులు, పోలీసు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మా వాళ్లను విపరీతంగా కొట్టారు. మావాళ్లు కాపాడిన బాలికల వయసు 11 ఏళ్లు మాత్రమే ఉంటాయి. ఇలాంటి గృహాల్లో బంధీ అయిన వారిని రక్షించడం చాలా కష్టమైన పనే. అయితే ప్రతి బాలికకు స్వేచ్ఛను అందించే వరకు ఎన్ని దాడులు ఎదురైనా మేము ముందుకు వెళ్తూనే ఉంటాం’’ అని కైలాష్ సత్యార్థి ట్వీట్ చేశారు.

Updated Date - 2021-12-14T02:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising