ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం పొందడం ప్రజల హక్కు: ప్రియాంకగాంధీ

ABN, First Publish Date - 2021-10-07T18:09:18+05:30

లఖీంపూర్‌ ఖేరికి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు బుధవారం అనుమతి ఇచ్చారు. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలతో కలిసి రాహుల్‌ లఖ్‌నవూ చేరుకున్నారు. సోమవారం నుంచి సీతాపూర్‌లోని గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధంలో ఉన్న ప్రియాంక వద్దకు రాహుల్‌ వెళ్లారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: లఖింపూర్ బాధితుల పట్ల యోగి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి బాధితులకు న్యాయాన్ని అందకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. న్యాయం పొందడం ప్రజల హక్కని, బాధితులకు న్యాయం అందే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఆమె గురువారం స్పష్టం చేశారు.


ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ ‘‘హంతకులు కళ్ల ముందే ఉన్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుక ఆశిష్ మిశ్రానే ఆ ప్రమాదానికి కారణమని చాలా వీడియోల్లో కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. అజయ్ మిశ్రా కేంద్ర మంత్రిగా ఉన్నంత వరకు బాధితులకు న్యాయం లభించడం కష్టం. ముందు ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలి. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి’’ అని అన్నారు.


కాగా, లఖీంపూర్‌ ఖేరికి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు బుధవారం అనుమతి ఇచ్చారు. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలతో కలిసి రాహుల్‌ లఖ్‌నవూ చేరుకున్నారు. సోమవారం నుంచి సీతాపూర్‌లోని గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధంలో ఉన్న ప్రియాంక వద్దకు రాహుల్‌ వెళ్లారు. అక్కడి నుంచి రాహుల్‌, ప్రియాంక ఇతర కాంగ్రెస్‌ నేతల బృందం.. లఖీంపూర్‌ ఖేరీకి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించింది.

Updated Date - 2021-10-07T18:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising