ఎన్హెచ్ఆర్సీ కొత్త చైర్మన్‌గా అరుణ్ మిశ్రా..!
ABN, First Publish Date - 2021-06-01T18:57:37+05:30
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ..
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం దాదాపు ఖరారైంది. ఆయన పేరును హై-పవర్డ్ రికమండేషన్స్ కమిటీ ప్రతిపాదించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఎంపిక కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. దళిత, ఆదివాసి, మైనరిటీ కమ్యూనిటీల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నందున ఆ వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయాలని ఖర్గే సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. పరిశీలనకు వచ్చిన ఇతర పేర్లలో జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ రాజీవ్ జైన్ కూడా ఉన్నారు. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2020 డిసెంబర్లో పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక జరగలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ చంద్ర పంత్ ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2020 సెప్టెంబర్ 2న పదవీ విరమణ చేశారు.
Updated Date - 2021-06-01T18:57:37+05:30 IST